లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..! 8 h ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. గత వారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సోమవారం లాభాల్లో కదలాడాయి. ఇంట్రాడేలో 78,918.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ 498.58 పాయింట్ల లాభంతో, 78,540.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 165.95 పాయింట్ల లాభంతో 23,753.45 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.13 వద్ద ఉంది.